తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ చిన్నారితో డ్యాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి - చిన్నారితో డ్యాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

ఏడాది వయసున్న తన మనవరాలు నవిష్కను ఆటపట్టిస్తూ, ఆ చిన్నారితో పాటు డ్యాన్స్​ చేస్తున్న ఓ వీడియోను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఆ చిన్నారితో డ్యాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
మనవరాలు నవిష్కతో డ్యాన్స్ చేసిన మెగాస్టార్ చిరు

By

Published : Apr 28, 2020, 11:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి సస్పెన్స్​కు తెరదించారు. సోమవారం చేసిన ట్వీట్​కు సంబంధించి, ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో తన మనవరాలు నవిష్కతో కలిసి 'ఖైదీ నంబర్.150'లోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దానిని ట్విట్టర్​లో పంచుకున్నారు.

ఈ వీడియోలో భాగంగా నవిష్కను ఒడిలో కూర్చోపెట్టుకుని, తనను ఏ పాట కావాలని చిరంజీవి అడిగారు. 'మీమీ' అంటూ ముద్దుగు చెప్పిందా చిన్నారి. ఎప్పుడూ అదే పాటేనా మరోకటి విందాం అని ఆ బుజ్జాయితో చెప్పగా, బుంగమూతి పెట్టుకుని ఏడవడం ప్రారంభించింది. వెంటనే సముదాయించి, టీవీలో 'మిమ్మీ మిమ్మిమ్మీ' పాటను ప్లే చేశారు చిరు. అప్పుడు ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించింది నవిష్క. ఆ చిన్నారితో పాటే చేతులు కదుపుతూ డ్యాన్స్ చేశారు మెగాస్టార్. అయితే గీతాన్ని మధ్యలో ఆపి మనవరాలిని ఆటపట్టించారు చిరు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details