తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు బర్త్​డే మోషన్ పోస్టర్.. బాస్ స్టైల్ అదుర్స్ - చిరు ఆచార్య

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా కామన్ డీపీతో పాటే మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.

చిరు బర్త్​డే మోషన్ పోస్టర్.. 100 సెలబ్రిటీలు పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి

By

Published : Aug 21, 2020, 7:27 PM IST

Updated : Aug 21, 2020, 7:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి రేపటితో(ఆగస్టు) 65 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కామన్ డిస్​ప్లే మోషన్ పోస్టర్​ను విడుదల చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన 100 మంది సెలబ్రిటీలు దీనిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒకేసారి పోస్ట్ చేయడం విశేషం. దీనితో పాటే హీరో రామ్‌చరణ్‌.. చిరంజీవి పుట్టినరోజు కామన్‌ డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌)ని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. చిరంజీవి కెరీర్‌ను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దారు.

చిరంజీవి పుట్టినరోజు సీడీపీ

ఇందులో చిరు నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లోని పాత్రలను ఒక్కో మెట్టుపై ఉంచారు. 'ఖైదీ', 'పసివాడి ప్రాణం', 'స్వయంకృషి', 'గ్యాంగ్‌లీడర్‌', 'ఘరానా మొగుడు', 'ఇంద్ర', 'ఖైదీ నంబర్‌ 150' చిత్రాల్లో పాత్రలను ఒక్కో మెట్టుపై నిలబెడుతూ చూపించారు. మెగాస్టార్‌ టైటిల్‌లో 'సైరా: నరసింహారెడ్డి' పాత్రను ఉంచారు. చిరంజీవి కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరమై.. రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఆ కాలాన్ని కూడా ఈ డీపీలో చూపించడం విశేషం. 'ఇంద్ర'-'ఖైదీ నంబర్‌ 150' పాత్రల మధ్యలో కొంత భాగం ఫ్లాట్‌గా రాళ్లు, మొక్కలు ఉన్నట్లు చూపించారు.

చిరు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'ఆచార్య' సినిమా ఫస్ట్​లుక్​తో పాటు మోషన్​ పోస్టర్​ను సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

Last Updated : Aug 21, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details