నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి.. తన సతీమణితో కలిసి కైకాల ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
"తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి."
--చిరంజీవి, నటుడు.
కైకాల సత్యనారాయణ.. తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్లకు పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు.. నటుడిగా 2019లోనే షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద విడుదల అయితే, 1935, జులై 25న సత్యనారాయణ జన్మించారు. 1959లో ఆయన నటించిన చిత్రం 'సిపాయి కూతురు' విడుదలయింది. ఆ విధంగా నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి.. 61సంవత్సరాల పాటు అనేక పాత్రలు పోషించి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదీ చదవండి:టాలీవుడ్ యముడు.. నటనా కౌశలుడు 'కైకాల'