మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే అభిమానులు సందడి మొదలుపెట్టారు. దీనితో పాటు ఆయన సినిమాల అప్డేట్స్ కూడా వరుసగా రానున్నాయి. వాటి గురించి, కొత్త చిత్రాల టైటిల్స్ గురించి వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
చిరు 'గాడ్‌ఫాదర్'
చిరు.. 'ఆచార్య'తోపాటు తన 153వ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. 'లూసిఫర్' రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం 'గాడ్ ఫాదర్' టైటిల్ పరిశీలనలో ఉందట. శనివారం సాయంత్రం 5:04 గంటలకు దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
గుండు గెటప్‌తో 'బోళా శంకర్'!
అలానే మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చేయబోయే సినిమా అప్డేట్స్ ఆదివారం(ఆగస్టు 22) ఉదయం 9 గంటలకు వెల్లడించనున్నారు. 'బోళా శంకర్' టైటిల్ అనుకుంటున్నారని, దానిని రివీల్ చేయడం సహా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.