తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Chiranjeevi Birthday: మెగాస్టార్​ బర్త్​డే సర్​ప్రైజ్​లు ఇవే - చిరంజీవి భోళా శంకర

ఇవాళ(ఆగస్టు 22) మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డెట్స్​ ప్రకటించాయి ఆయా చిత్రబృందాలు. దీంతో అభిమానుల్లో జోష్​ పెరిగింది. ఓ సారి ఆ అప్డేట్స్​పై లుక్కేద్దాం..

chiru
చిరు

By

Published : Aug 22, 2021, 9:31 PM IST

మెగాస్టార్​ చిరంజీవి.. ఆరు పదుల వయసు దాటిన ఆయనలో అదే జోరు, అదే ఉత్సాహం. అందుకే ఇప్పటికీ సినిమాల విషయంలో చిరు దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. 'ఖైదీ నంబర్​ 150'తో బాక్సాఫీస్​ బద్దల కొడుతూ రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి'తో దుమ్మురేపారు. ప్రస్తుతం 'ఆచార్య'లో నటిస్తూనే.. యువ హీరోల కన్నా జోరుగా కొత్త సినిమాలను ఓకే చేస్తూ అభిమానుల్లో జోష్​ నింపుతున్నారు. ఇవాళ మెగాస్టార్​​ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించి వరుస సర్​ప్రైజ్​లతో​ ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్​ ఇచ్చారు మేకర్స్​. ఈ నేపథ్యంలో చిరు నటించే సినిమాలు ఏంటి? ఈరోజు వచ్చిన అప్డేట్స్​ ఎంటో చూద్దాం..

దర్శకుడు మోహన్​ రాజా దర్శకత్వంలో చిరు 'లూసిఫర్'​ రీమేక్​ చేయనున్నారు. దీనికి 'గాడ్​ ఫాదర్'​గా టైటిల్​ ప్రకటిస్తూ మోషన్​ పోస్టర్​ను శనివారమే విడుదల చేసింది చిత్రబృందం. ఇది ఫ్యాన్స్​ను బాగా అలరించింది.

మెహర్​ రమేష్​-చిరు కలయికలో రానున్న సినిమా టైటిల్​ను 'భోళా శంకర్'​గా ప్రకటించారు. ఇందులో హీరోయిన్​ కీర్తిసురేష్​.. మెగాస్టార్​కు చెల్లిలిగా నటించనుంది. ఇవాళ రాఖీ పండగ సందర్భంగా కీర్తి.. చిరుకు రాఖీ కడుతున్న వీడియోను పోస్ట్​ చేసింది చిత్రబృందం. ఇది చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్​గా ఉంది.

చిరు 154వ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రయూనిట్​. ఇందులో ఊరమాస్​లుక్​లో మెగాస్టార్​ కనిపించడం వల్ల ఫ్యాన్స్​ ఫుల్​ హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్​ వారు నిర్మిస్తుండగా, బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు.

'ఆచార్య' చిత్రబృందం కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ సందడి చేయనుంది. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details