యంగ్‌టైగర్ జూ.ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి.. 'బీ ద రియల్ మ్యాన్' అనిపించుకున్నారు. ఇంటిపనుల్లో తన వంతు సాయం చేసి, ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇంటిని శుభ్రం చేస్తూ, దోశలు వేస్తూ కనిపించారు. తను రోజు చేసే పనులేనని.. ఇవాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యమని రాసుకొచ్చారు.
దోశలేస్తూ.. ఇంటిని శుభ్రం చేస్తూ చిరు ఛాలెంజ్ పూర్తి - tarak chiru
మెగాస్టార్ చిరంజీవి 'బీ ద రియల్‌మ్యాన్' అనిపించుకున్నారు. ఇంటి పనిలో సాయం చేసి, ఆ వీడియోను పోస్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి
అనంతరం మంత్రి కేటీఆర్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఈ సవాలు విసురుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్ తదితరులు ఇంట్లో పనిని విజయవంతంగా పూర్తి చేసి రియల్ మ్యాన్ అనిపించుకున్నారు.
Last Updated : Apr 23, 2020, 4:54 PM IST