మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎన్నో అంచనాలుంటాయి. కొన్నిసార్లు టైటిల్ చెప్పగానే ఫలానా కథనం ఉంటుందంటూ అభిమానులు సంతోషపడుతుంటారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే చిత్రంపైనా ఇలాంటి వదంతులే వస్తున్నాయి. అయితే అందుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది.
దేవాదాయశాఖ ఉద్యోగిగా మెగాస్టార్ చిరు? - tollywood news
మెగాస్టార్ చిరంజీవి.. కొత్త సినిమాలో దేవాదాయ శాఖ ఉద్యోగిగా కనిపించనున్నాడట. హైదరాబాద్‌లో నిర్మించిన సెట్లో త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి
ఈ సినిమాలో చిరంజీవి.. ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడట. అయితే అదీ దేవాలయాల్లో కార్యనిర్వహక విధులు నిర్వర్తించే పాత్ర పోషించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఓ సెట్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు. అక్కడే త్వరలో షూటింగ్ మొదలు కానుంది. వీటన్నింటిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: చిరు 152వ సినిమా కోసం మసాజ్ 'ల్యాండ్'లో మ్యూజిక్ సిట్టింగ్స్
Last Updated : Dec 27, 2019, 6:58 PM IST