తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Chiranjeevi: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి కట్టిస్తానన్న మెగాస్టార్​ చిరంజీవి - telugu cinema news

కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మెగాస్టార్​.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని 24 విభాగాల్లోని సినీకార్మికులకు తీపి కబురు అందించారు.

Chiranjeev
Chiranjeev

By

Published : Aug 22, 2021, 9:18 PM IST

Updated : Aug 22, 2021, 9:50 PM IST

తన పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్​ చిరంజీవి సినీ కార్మికులకు తీపికబురు చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో.. సినీ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, టీకాలు వేయించిన చిరు.. తన పుట్టినరోజును పురస్కరించుకొని.. 24 విభాగాల్లోని సినీ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా చిత్రపురి కాలనీలో 10 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించారు. అపోలో ఆస్పత్రి సహకారంతో అన్ని రకాల వైద్య చికిత్సలు అందేలా ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలోనే చేపడతానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు సినీనటుడు శ్రీకాంత్ తెలిపారు.

చిరంజీవి పుట్టినరోజును సందర్భంగా చిత్రపురి కాలనీ హౌసింగ్​ సొసైటీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్... రక్తదానం చేసిన సినీ కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆస్పత్రి నిర్మాణానికి ఇచ్చిన హామీని కార్మికులతో పంచుకున్నారు. సినీ కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న మెగాస్టార్​కు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Last Updated : Aug 22, 2021, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details