తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సీఎం కేసీఆర్​కు చిరు, రాజమౌళి థాంక్స్​ - సీఎం కేసీఆర్​ చిరంజీవి కృతజ్ఞతలు

రాష్ట్రంలో సినిమా షూటింగ్​లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్​కు మెగాస్టార్ చిరంజీవి, ఎస్​ఎస్​ రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

kcr
kcr

By

Published : Jun 9, 2020, 1:05 PM IST

రాష్ట్రంలో సినిమా షూటింగ్​లకు అనుమతి ఇవ్వడంపై సీఎం కేసీఆర్​కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది దినసరి కార్మికుల బతుకుదెరువును దృష్టిలో పెట్టుకొని సత్వరమే అనుమతులు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. విధివిధానాలు రూపొందించిన మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, అధికారులకు ట్విట్టర్​లో ధన్యవాదాలు తెలిపారు.

సినీ పరిశ్రమ బాధను అర్థం చేసుకొని చిత్రీకరణలకు అనుమతి ఇవ్వడం పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. సీఎం కేసీఆర్​కు ప్రత్యేకంగా ధన్యదావాలు తెలిపారు. క్లిష్ట సమయంలో తమ అభ్యర్థనలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. మళ్లీ పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు సినీ పరిశ్రమలో చిత్రీకరణలకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తూ.. ఎలా పని చేయాలనేదే సవాల్​గా మారిందని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details