Chiranjeevi: హీరోలంతా తాము నటించబోయే సినిమాలను వరుసపెట్టి ప్రకటించడం సాధారణమే. కానీ.. ఒక చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత మరో సినిమాలో నటిస్తుంటారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించడం విశేషం. ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేస్తూ ప్రస్తుతం యువహీరోలకు కూడా సాధ్యం కాని విధంగా ముందుకెళ్తున్నారు.
Chiranjeevi: చిరంజీవా.. మజాకా! ఒకే నెలలో నాలుగు సినిమాల్లో.. - మెగాస్టార్ చిరంజీవి సినిమాలు
Chiranjeevi: తన జోరు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుస చిత్రాలను ప్రకటించడం సహా ఈ డిసెంబర్లో ఏకంగా నాలుగు చిత్రాల షూటింగ్లలో పాల్గొంటున్నారు.
తాను చేయబోయే చిత్రాల గురించి గతేడాదే చిరంజీవి ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తన 152వ చిత్రం 'ఆచార్య'లో నటిస్తోన్న చిరు.. తన 153వ సినిమాగా రానున్న లూసిఫర్ రీమేక్ 'గాడ్ ఫాదర్' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొన్ని నెలల కిందట ప్రారంభమైంది. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్', బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా చిత్రీకరణ కూడా ఈ మధ్యే ప్రారంభమైంది. ఈ నెలలో ఆ నాలుగు సినిమా పనులతో చిరంజీవి బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి:Akhanda Sequel: బాలయ్య 'అఖండ'కు సీక్వెల్.. నిజమేనా?