తెలంగాణ

telangana

By

Published : May 14, 2021, 4:05 PM IST

ETV Bharat / sitara

వైరస్​ కంటే అదే చాలా ప్రమాదం: చిరంజీవి

కరోనా సెకండ్​ వేవ్​ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్​ కట్టడిపై అవగాహన కల్పిస్తూ వీడియో విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

megastar-chiranjeevi-about-covid-second-wave
చిరంజీవి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా రెండో దశ చాలా తీవ్రంగా ఉందని ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ఎంతో మంది కరోనా బారిన పడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన అనుకునే ఆత్మీయులను కోల్పోతుండటం గుండె తరుక్కుపోతుందని వాపోయారు.

మెగాస్టార్ చిరంజీవి

కరోనా రెండో దశలో బాధితులు కోలుకోడానికి చాలా సమయం పడుతుందని, అందుకే ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించిందని చిరు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లాక్​డౌన్ సడలింపులోనూ ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ పాజిటివ్ అయినా ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వైరస్ కంటే భయమే ముందు మనల్ని చంపేస్తుందని అన్నారు. లాక్​డౌన్​లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, రిజిస్ట్రేషన్ చేసుకొని వీలైనప్పుడు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని కోరారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని, మన దేశాన్ని కాపాడుకుందామని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details