తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగబాబుపై చేయిచేసుకున్న చిరంజీవి - chiranjeevi slapped naga babu

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఓ సందర్భంగా నాగబాబుపై చిరు చేయి చేసుకున్నాడట. ఆ కారణాన్ని వివరించాడీ మెగా హీరో.

నాగబాబు

By

Published : Oct 12, 2019, 6:27 PM IST

అగ్ర కథానాయకుడు చిరంజీవి సోదరుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు నాగబాబు. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా 'జబర్దస్త్' కామెడీషోకు న్యాయనిర్ణేతగానూ ఎంతోమందికి చేరువయ్యాడు. అయితే ఏ విషయంలోనైనా తనకు అన్నయ్యే స్ఫూర్తి అని చెప్పే ఈ నటుడు చిన్నప్పుడు చిరంజీవి చేతిలో దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి చెప్పాడు మెగాస్టార్.

‘‘నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో నాగబాబు ఆరో, ఏడో చదువుతున్నాడు. ఆ సమయంలో అమ్మకు అన్ని విషయాల్లో సహాయపడుతూ, పనులన్నీ నేనే చేసేవాడిని. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకువచ్చి, మరో చోటుకీ వెళ్లాల్సి వచ్చింది. రెండూ ఒకే సమయంలో చేయాల్సి రావడం వల్ల ‘నేను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా’ అని నాగబాబుకు చెప్పా. నేను పని చూసుకుని వచ్చి ‘బట్టలు తెచ్చావా?’ అని అడిగితే ‘తీసుకురాలేదు’ అన్నాడు. ‘ఎందుకు తేలేదు’ అని అడిగితే.. ‘నిద్ర పోతున్నా’ అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చి కొట్టేశాను. అది చూసి అమ్మకు నాపై మరింత కోపం వచ్చి ‘చిన్నోడిని అలా కొడతావా?’ అంటూ నన్ను బాగా తిట్టేసింది. సాయంత్రం నాన్న రాగానే, ఏడుస్తూ మొత్తం చెప్పేశా. అప్పుడు నాన్న వెళ్లి నాగబాబును మందలించారు. అప్పుడు నాకు రిలీఫ్‌గా అనిపించింది’ అంటూ నవ్వుతూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు చిరు.

చిరంజీవి-నాగబాబు కలిసి పలు సినిమాల్లో నటించారు. ‘అంజి’ సినిమాలో చిరంజీవిని పెంచి పెద్ద చేసిన వ్యక్తిగా పెద్దయ్య అనే పాత్రలో నటించాడు నాగబాబు. ఆ పాత్రకు సంబంధించిన సంభాషణల్లో చిరుని ‘ఒరేయ్‌’, ‘ఏరా’ అంటూ పిలవాల్సి ఉండగా, తాను అన్నయ్యను అలా పిలవలేనని చెప్పాడట. విషయం చిరంజీవి దృష్టికి తీసుకెళ్లిందట చిత్ర బృందం. దీంతో చిరు వచ్చి ‘మనం కేవలం ఆ పాత్రల్లో నటిస్తున్నామంతే. ఫర్వాలేదు పిలువు’ అని చెబితే అప్పుడు ఒప్పుకొన్నాడట నాగబాబు.

ఇవీ చూడండి.. మహేశ్​ సినిమా ఫ్లాప్​పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

ABOUT THE AUTHOR

...view details