ఈరోజు రియల్ స్టార్ శ్రీహరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమాను ప్రకటించింది చిత్రబృందం. 'శతమానం భవతి'తో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడి చిత్రం - సతీశ్ వేగేశ్న మేఘాంశ్ శ్రీహరి చిత్రం
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి నుంచి కొత్త చిత్రం రాబోతుంది. సతీశ్ వేగేశ్న దర్శకుడు. ఇందులో సతీశ్ కుమారుడు సమీర్ వేగేశ్న కూడా కీలకపాత్ర పోషించనున్నాడు.
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడి చిత్రం
ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటించనున్నారు. మేఘాంశ్ శ్రీహరితో పాటు వేగేశ్న సతీశ్ తనయుడు సమీర్ వేగేశ్న కూడా కీలకపాత్ర పోషించనున్నాడు. ఈరోజు శ్రీహరి జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సినిమాను ప్రకటించారు.