తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ తొలి ట్వీట్ - chiru next movie

మెగాహీరో చిరంజీవి ట్విట్టర్​ ఖాతా ప్రారంభించి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ తొలి ట్వీట్ చేశాడు. కరోనాను జయించేందుకు ప్రస్తుతం ఇంటిపట్టునే ఉందామని అన్నాడు.

ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ తొలి ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి

By

Published : Mar 25, 2020, 11:32 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఎట్టేకలకు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టాడు. ఇన్​స్టా, ఫేస్​బుక్​లలో తాజాగా ఖాతాలు ప్రారంభించిన చిరు.. ఉగాది సందర్భంగా ట్విట్టర్​లో అడుగుపెట్టాడు. పండుగ శుభాకాంక్షలు చెబుతూ తొలి ట్వీట్ చేశాడు.

"అందరికీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటిపట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం" -మెగాస్టార్ చిరంజీవి తొలి ట్వీట్

ABOUT THE AUTHOR

...view details