'సైరా' ఇచ్చిన విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. తన 152వ సినిమాను మొదలుపెట్టేశాడు. తన నివాసంలో సతీమణి సురేఖ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. చిరు తల్లి అంజనాదేవీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి-రామ్‌చరణ్ మల్టీస్టారర్ షురూ..! - సైరా సినిమా కలెక్షన్లు
ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమా ప్రారంభించాడు. హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ఇందులో రామ్‌చరణ్ మరో హీరోగా నటించనున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి-రామ్‌చరణ్ మల్టీస్టారర్ షురూ
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి పూర్తిస్థాయిలో వెండితెరపై సందడి చేయబోతున్నాడు చిరు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Last Updated : Oct 8, 2019, 11:06 PM IST