తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగా ప్రిన్స్​ పరిచయానికి ఐదేళ్లు - మెగా ప్రిన్స్

'ముకుంద'తో వెండితెరకు పరిచయమైన మెగా ప్రిన్స్​ వరుణ్​తేజ్.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరో తెలుగు తెరకు పరిచయమై నేటికి ఐదేళ్లయిన సందర్భంగా ఓ కథనం.

mega prince
వరుణ్ తేజ్

By

Published : Dec 24, 2019, 3:33 PM IST

'ముకుంద'గా పరిచయం అయ్యాడు. 'మిస్టర్‌' 'లోఫర్‌' అనిపించుకున్నాడు. 'తొలిప్రేమ'తో 'ఫిదా' చేశాడు. 'కంచె'ను దాటి 'అంతరిక్షం' ఎలా ఉంటుందో చూపించాడు. 'ఎఫ్‌2'తో నవ్వులు పంచాడు, 'గద్దలకొండ గణేష్‌'గా వరుణ్‌ తేజ్‌ అంటే ఇది.. అని నిరూపించాడు.

వరుణ్ తేజ్

ఆరడుగుల ఎత్తు, అందం అతడి సొత్తు అనాల్సిందే. అందుకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టక ముందే 'మెగా ప్రిన్స్‌' అన్నారు అభిమానులు. మెగా కుటుంబం నుంచి నటుడు వస్తున్నాడంటే చాలు సినీ ప్రియుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. మాస్‌ నేపథ్యంలోనే తెరంగ్రేటం చేస్తాడనే అంతా అనుకుంటారు. కానీ, అంచనాలు తారుమారు చేస్తూ 'ముకుంద'గా వచ్చాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. 2014 డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో వరుణ్‌ వెండితెరకు పరిచయమై ఐదేళ్లు పూర్తయ్యాయి.

వరుణ్ తేజ్

రెండో చిత్రం 'కంచె'.. క్రిష్‌ దర్శకత్వంలో చేశాడు. పూరీ జగన్నాథ్‌ 'లోఫర్‌'గా మార్చాడు. శ్రీను వైట్ల 'మిస్టర్‌' అని పిలిచాడు. వరుణ్‌ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచే చిత్రాల్లో ముందుంటుంది 'ఫిదా'. శేఖర్‌ కమ్ముల తీసిన ఈ సినిమాలో వరుణ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వెంటనే 'తొలిప్రేమ' అంటూ మరో ప్రేమకథతో యువతను ఆకట్టుకున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో 'అంతరిక్షం' అని టాలీవుడ్‌కు కొత్త తరహా స్క్రీన్‌ప్లే అందించాడు. 'ఎఫ్‌2'తో ఫుల్‌ ఫన్‌ పంచి, 'గద్దలకొండ గణేష్‌'గా నట విశ్వరూపం చూపాడు. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు వరుణ్‌.

వరుణ్ తేజ్

ఇవీ చూడండి.. 'బ్యూటిఫుల్'​ హీరోయిన్​తో ఆర్జీవీ డ్యాన్స్​

ABOUT THE AUTHOR

...view details