తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డిసెంబర్​లో బాక్సాఫీస్ వద్ద సందడే సందడి! - క్రిస్మస్​కు తడప్

ఈ ఏడాది క్రిస్మస్​కు సినిమాల సందడి మామూలుగా ఉండేటట్లు లేదు. ఇప్పటికే మూడు భారీ ప్రాజెక్టులు ఈ సీజన్​లో రిలీజ్​ను ఖరారు చేసుకోగా మరికొన్ని ఇదే బాటలో పయనించనున్నాయి.

boxoffice
బాక్సాఫీస్

By

Published : Aug 24, 2021, 9:32 PM IST

కరోనా రెండో దశ కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల సినిమాల రిలీజ్​లతో పాటు చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇటీవలే మళ్లీ థియేటర్లు తెరచుకోవడం, షూటింగ్​లకు గ్రీన్ సిగ్నల్ లభించడం వల్ల సినీ పరిశ్రమ షూటింగ్​లతో బిజీగా మారింది. అలాగే దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్స్​తో సందడి చేస్తున్నారు.

దసరాకు నిరాశే

ప్రస్తుతం అక్టోబర్​లో కరోనా మూడో దశ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దసరా సీజన్​కు సినిమాల్ని విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అందరూ డిసెంబర్​లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి సీజన్​పైనే గురిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు ప్రకటించగా పోరు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం క్రిస్మస్​ పోటీ కూడా వేడెక్కుతోంది. టాలీవుడ్​, బాలీవుడ్​తో పాటు హాలీవుడ్​ కూడా ఈ సీజన్​పైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇప్పటికే ఈ సీజన్​లో నాలుగు చిత్రాలు రిలీజ్ డేట్స్ ఖరారు చేసుకున్నాయి.

పుష్ప

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాట రికార్డులు సృష్టిస్తూ మూవీపై మరిన్ని అంచనాలు పెంచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్​ను ఖరారు చేసింది చిత్రబృందం. క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ సినిమాతో పాటు మరికొన్ని టాలీవుడ్ చిత్రాలూ.. ఈ సీజన్​పై కన్నేశాయి.

లాల్ సింగ్ చద్ధా

ఆమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చద్ధా'. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులూ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని కూడా క్రిస్మన్ బరిలో ఉంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం.

స్పైడర్ మ్యాన్

హాలీవుడ్​ మూవీ 'స్పైడర్​ మ్యాన్​: నో వే హోమ్'​కు సంబంధించి నేడు విడుదల తేదీని ప్రకటించారు. ఇండియాలో డిసెంబర్​ 17న ఈ సినిమాను రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. క్రిస్మస్​ పండగను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టామ్​ హోలండ్​ టైటిల్​ రోల్​లో నటిస్తున్నాడు. అతడి సరసన జెందాయా స్క్రీన్ పంచుకోనుంది. కెవిన్​ ఫీగె, అమీ పాస్కల్​ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్​ వాట్స్ దర్శకత్వం వహిస్తున్నారు. మైకేల్ జియాచినో సంగీతం అందిస్తున్నారు.

తడప్

'ఆర్​ఎక్స్​ 100' బాలీవుడ్​ రీమేక్​గా తెరకెక్కుతోన్న సినిమా 'తడప్'​. ఈ చిత్రంలో సునీల్​ శెట్టి తనయుడు అహన్​ శెట్టి హీరోగా పరిచయమవుతున్నాడు. అతడి సరసన తారా సుతారియా హీరోయిన్​గా నటించనుంది. మిలన్​ లుథ్రియా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని డిసెంబర్​ 3న రిలీజ్ చేయనున్నారు.

ఇవేకాక మరికొన్ని సినిమాలూ ఈ సీజన్​పై కన్నేశాయి. దీంతో రిలీజ్ డేట్లు ఎలా ఉన్నా.. థియేటర్లు దొరికే పరిస్థితి మాత్రం కష్టంగానే మారింది. ​

ఇవీ చూడండి: పవర్‌స్టార్‌ బర్త్‌డే.. లేడీ స్టార్స్‌ ఇరగదీశారు!

ABOUT THE AUTHOR

...view details