మెగాహీరో వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన తన మొదటి చిత్రం 'ఉప్పెన' అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తోంది. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే తన తొలి చిత్రం విజయంతో తేజ్ రెమ్యునరేషన్ పెంచేశారని తెలిసింది.
'ఉప్పెన'కు వైష్ణవ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? - వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్
తొలి సినిమా 'ఉప్పెన'తో ఘన విజయం అందుకున్న మెగాహీరో వైష్ణవ్ తేజ్.. రెమ్యునరేషన్ పెంచేశారని సమాచారం. ఈ క్రమంలో 'ఉప్పెన' చిత్రం సహా తర్వాత ఒప్పుకున్న సినిమాలకు ఆయన తీసుకున్న పారితోషికం గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.
వైష్ణవ్
'ఉప్పెన' సినిమా కోసం.. రూ.50 లక్షలు తీసుకోగా, క్రిష్ దర్శకత్వంలో పూర్తి చేసిన రెండో సినిమా(రూ.75లక్షలు), ప్రస్తుతం తెరకెక్కబోతున్న మూడో సినిమాకు ఏకంగా రూ.2.5కోట్లు తీసుకోనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చడండి: హృతిక్ రికార్డును అధిగమించిన వైష్ణవ్‌తేజ్