తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పవన్​ కల్యాణ్​తో మాస్​ ఎంటర్​టైనర్​ చేస్తా' - సాయి ధరమ్​ తేజ్​ న్యూస్​

టాలీవుడ్​ హీరో సాయిధరమ్​ తేజ్​ నటించిన 'చిత్రలహరి' సినిమా విడుదలై ఆదివారానికి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా ట్విట్టర్​లో అతడు అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధామనిచ్చాడీ యువ కథానాయకుడు.

Mega Hero SaiDharamTej Special Twitter Chat
'పవన్​కల్యాణ్​తో మాస్​ ఎంటర్​టైనర్​ చేస్తా!'

By

Published : Apr 13, 2020, 6:25 PM IST

తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి జరగనుందని.. తనని ఇప్పుడు ఏం చేయమంటారు అని ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌కు సాయిధరమ్‌ తేజ్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. తేజ్‌ కథానాయకుడిగా నటించిన 'చిత్రలహరి' సినిమా విడుదలై ఆదివారంతో ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ హీరో ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించాడు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు తెలిపాడు. ఆ విశేషాలివే..

సాయి ధరమ్​తేజ్​
  • పవన్‌ కల్యాణ్‌ ఫొటోల్లో మీకు బాగా నచ్చిన ఫొటోను మాతో పంచుకోగలరు?

సాయిధరమ్‌ తేజ్‌:పవన్‌ మొదటి సినిమా షూట్‌కు సంబంధించిన ఫొటోల్లో ఇది ఒకటి. నాకెంతో ఇష్టమైన ఫొటో.

పవన్​కల్యాణ్​
  • మీకు ఎప్పటికీ గుర్తుండే ఓ మధుర జ్ఞాపకం?

సాయిధరమ్‌ తేజ్‌:నా జీవితంలో ఎన్నో మరచిపోలేని మధురానుభూతులున్నాయి. కానీ ప్రేమాభిమానాలు, సపోర్ట్‌ పొందిన రోజుని ఎప్పటికీ మర్చిపోలేను.

  • మీకు ఇష్టమైన క్రీడ?

సాయిధరమ్‌ తేజ్‌:క్రికెట్‌

  • ఏదైనా నేర్చుకోవడానికి సంవత్సర కాలాన్ని మీకు ఇస్తే.. ఏం నేర్చుకుంటారు?

సాయిధరమ్‌ తేజ్‌:కొత్త భాషను నేర్చుకోవడమంటే నాకెంతో ఇష్టం.

  • లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ను మిస్‌ అవుతున్నారా?

సాయిధరమ్‌ తేజ్‌:బాగా మిస్ అవుతున్నాను.

  • రవితేజ గురించి ఒక్కమాటలో చెప్పండి? అలాగే ఆయనతో మీ మల్టీస్టారర్‌ ఎప్పుడు ఉంటుంది?

సాయిధరమ్‌ తేజ్‌:మంచి స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నాం.

  • మీ అమ్మ మిమ్మల్ని ముద్దుగా తేజు అని కాకుండా ఇంకా ఏమని పిలుస్తారో తెలుసుకోవాలని ఉంది?

సాయిధరమ్‌ తేజ్‌:ముద్దు పేర్లు అంటూ ఏమీ లేవు. కేవలం తేజ్‌ లేదా తేజు

  • మీ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌:మైఖెల్‌ బెవన్‌, యువరాజ్‌, ధోనీ

  • పవన్‌ కల్యాణ్‌తో కలిసి సినిమా చేసే ఛాన్స్‌ వస్తే ఎలాంటి సినిమా చేస్తారు?

సాయిధరమ్‌ తేజ్‌:పక్కా.. ఊర మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌

సాయి ధరమ్​ తేజ్​, పవన్​ కల్యాణ్​
  • యువతకు బాగా కనెక్ట్‌ అయ్యేలా 'చిత్రలహరి' సినిమాను ఎంచుకున్నారు. ఆ కథ వినగానే మీ ఫీలింగ్‌ ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌:కథ విన్న వెంటనే ఆ సినిమాను మిస్‌ కాకూడదనిపించింది. ఇప్పటి యువత తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.

  • కల్యాణ్‌ బాబాయ్‌ మిమ్మల్ని ఫాలో అయ్యాక ఏమనిపించింది?

సాయిధరమ్‌ తేజ్‌:షాక్‌, థ్రిల్‌ అలాగే కొంచెం బాధ్యతగా అనిపించింది.

  • మీ తదుపరి చిత్రం 'సోలో బ్రతుకే సో బెటరు' గురించి ఏమైనా చెప్పగలరు?

సాయిధరమ్‌ తేజ్‌:మనలోని చాలామంది తప్పకుండా ఈ చిత్రానికి కనెక్ట్‌ అవుతారు.

  • 'ప్రతిరోజూ పండగే' చిత్రం తర్వాత మారుతితో కలిసి మరో సినిమా చేస్తానని మీరు చెప్పారు? ఆ సినిమా ఎప్పుడు ఆరంభమవుతుంది?

సాయిధరమ్‌ తేజ్‌:హ హ్హ హ్హ.. అదంతా మారుతి అన్న చేతిలో ఉంది. ఆయనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

  • మీరు ఎవరితో మల్టీస్టారర్‌ చేయాలనుకుంటున్నారు?

సాయిధరమ్‌ తేజ్‌:రవితేజ అలాగే నా బావ వరుణ్‌ తేజ్‌

  • 'సోలో బ్రతుకే సో బెటరు' కోసం వైజాగ్‌లో షూటింగ్‌ చేయడం ఎలా ఉంది?

సాయిధరమ్‌ తేజ్‌:వైజాగ్‌లో షూటింగ్‌ నాకెంతో నచ్చింది. ఇప్పటివరకూ నేను షూటింగ్‌ చేసిన బెస్ట్‌ లోకేషన్స్‌ అన్నింటిలో వైజాగ్‌ కూడా ఒక్కటి.

  • మీరు తప్పకుండా పోషించాలనుకుంటున్న డ్రీమ్‌ రోల్ లేదా ఛాలెంజింగ్‌ రోల్‌?

సాయిధరమ్‌ తేజ్‌:చాలా ఉన్నాయి. దేవకట్టా చిత్రంలో నేను పోషించబోయే పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా ఉండనుంది.

  • కరోనా మహమ్మారి సమయంలో మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌: ప్రకృతి కంటే ఎవరూ గొప్పవారు కాదు. బతకండి.. బతకించండి. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సమయం వచ్చినందుకు సంతోషించండి. మీ గురించి మీరు మరింత తెలుసువకోడానికి ఇదో మంచి సమయం.

  • ఇటీవల విడుదలైన మలయాళం సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం?

సాయిధరమ్‌ తేజ్‌: డ్రైవింగ్‌ లైసెన్స్‌ బాగా నచ్చింది.

  • అల్లు అర్జున్‌ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?

సాయిధరమ్‌ తేజ్‌: మా తరంలో ఎక్కువ కష్టపడి పనిచేసే నటుడు. సినిమా సినిమాకీ ఏదో ఒక కొత్తదనం చూపిస్తుంటాడు.

  • ప్రస్తుతం మీరు కొత్త దర్శకులను ప్రోత్సహిస్తారా?

సాయిధరమ్‌ తేజ్‌: ప్రస్తుతం నేను నూతన దర్శకుడితోనే పనిచేస్తున్నాను. అలాగే ఆసక్తికరమైన, విభిన్న కథలతో మరింత మంది కొత్త దర్శకులతో పనిచేయనున్నాను.

  • ఎన్టీఆర్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?

సాయిధరమ్‌ తేజ్‌: సినీ ఇండస్ట్రీలో ఉన్న ఓ స్నేహితుడు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఆయన్ని కలిశాను. టాలెంటెడ్‌ యాక్టర్‌

  • ఈ ఫొటో గురించి ఒక మాట చెప్పండి?
    పవన్​ కల్యాణ్​, చిరంజీవి, సాయి ధరమ్​ తేజ్​

సాయిధరమ్‌ తేజ్‌: నా రెండు కళ్లు

  • మీకు నచ్చిన హాలీవుడ్‌ నటుడు?

సాయిధరమ్‌ తేజ్‌:నాకు చాలామంది హాలీవుడ్‌ నటులంటే ఇష్టం. ది రాక్‌ అంటే కొంచెం ఎక్కువ అభిమానం.

  • కుటుంబసభ్యులు కాకుండా మీ 2AM ఫ్రెండ్‌ ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌: నా చిన్నప్పటి నుంచి నవీన్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ నాకు మంచి స్నేహితులు. అలాగే మరో ముగ్గురు నా కాలేజ్‌ స్నేహితులు.

  • సెలబ్రిటీ అయినప్పటి నుంచి మీ గురించి మీరు ఏం నేర్చుకున్నారు?

సాయిధరమ్‌ తేజ్‌: నా గురించి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే ఇప్పటికీ నేర్చుకుంటున్నాను.

  • యాక్టింగ్‌ కాకుండా మీలో ఉన్న స్కిల్స్‌ ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌: నాకు ఆటలు ఆడడం అంటే ఇష్టం. ఫుట్‌బాల్‌ మాత్రం ఎలా ఆడాలో తెలియదు. ఇప్పటికీ ఎన్నోసార్లు ఆడాను కానీ విఫలమయ్యాను.

  • నెగిటివ్‌ రోల్‌ ఏమైనా చేస్తే చూడాలనుకుంటున్నాం?

సాయిధరమ్‌ తేజ్‌:తప్పకుండా.. నాకు కూడా 'డర్‌' సినిమాలో షారుఖ్‌ పోషించిన పాత్ర లాంటిది చేయాలని ఉంది.

  • మీ విజయ రహస్యం ఏమిటి?

సాయిధరమ్‌ తేజ్‌: ప్రతి ఒక్కరిలో ఉండే రహస్యం అది. హార్డ్‌ వర్క్‌

  • నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అవుతుంది. నేను ఏం చెయ్యాలి? మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను?

సాయిధరమ్‌ తేజ్‌: 'శంకర్‌దాదా ఎంబీబీస్‌' చిత్రంలో మన బాస్‌ ఏం చెప్పాడు.. 'చైల చైల' సాంగ్‌ ఒక్కసారి చూడండి

  • సత్యరాజ్‌ సర్‌ మీకు యాక్టింగ్‌లో ఏమైనా టిప్స్‌ ఇచ్చారా?

సాయిధరమ్‌ తేజ్‌:ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఆయన నడిచే విశ్వవిద్యాలయం.

ఇదీ చూడండి.. తెరపై తల్లి పాత్రలో.. ఇంట్లో మాస్​ స్టెప్పులతో!

ABOUT THE AUTHOR

...view details