తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమా రంగాన్ని ప్రేక్షకులే బతికించాలి' - సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ టైటిల్ సాంగ్

'సోలో బ్రతుకే సో బెటర్' టైటిల్ గీతం విడుదల సందర్భంగా పలు విషయాల గురించి చిత్రబృందం మాట్లాడింది. థియేటర్లు మళ్లీ తెరవడంపై ఆనందం వ్యక్తం చేసింది.

mega-hero-sai-tej-solo-brathuke-so-better-title-song-release-press-meet
'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రబృందం

By

Published : Dec 11, 2020, 4:18 PM IST

Updated : Dec 11, 2020, 4:34 PM IST

కరోనా కారణంగా కకావికలమైన సినిమా రంగాన్ని ప్రేక్షక దేవుళ్లే బతికించాలని 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్ర యూనిట్‌ విజ్ఞప్తి చేసింది. ఆరు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్ల వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారని కథానాయకుడు సాయితేజ్ చెప్పారు.

'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్ వ్యాఖ్యలు

సాయితేజ్ హీరోగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌'.. ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని ఓ థియేటర్‌లో సమావేశం ఏర్పాటు చేసి టైటిల్​ గీతాన్ని విడుదల చేశారు.

ఈ క్రమంలోనే మాట్లాడిన సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రావు రమేశ్.. సినిమా పది మందికి అన్నం పెట్టే తల్లిలాంటిదని అన్నారు. విడుదలవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే వీక్షించాలని ప్రేక్షకుల్ని కోరారు. ప్రతి ఒక్కరు తిరిగి థియేటర్‌కు వచ్చి సినిమా చూసే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రబృందం
Last Updated : Dec 11, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details