తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పండగ'లోని యాక్షన్‌ కోసం తేజ్ సిక్స్ ప్యాక్ - మారుతి

సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ప్రతిరోజు పండగే'. ఈ సినిమాలో తేజ్ సిక్స్ ప్యాక్​తో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

mega hero
సాయి తేజ్

By

Published : Dec 13, 2019, 8:58 PM IST

'ప్రతిరోజు పండగే' సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రం, గీతాలు బట్టి చూస్తే ఇదొక హాస్యభరితమైన కుటుంబకథాచిత్రం అని తెలుస్తుంది. తాతా మనవడి మధ్య సాగే అనుబంధాలకు ఇందులో పెద్ద పీట వేశారు. తాత పాత్రలో కట్టప్ప సత్యరాజ్‌ నటించాడు. ఇందులో యాక్షన్‌ కూడా తగిన పాళ్లలో ఉందని కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌ ద్వారా తెలిపింది చిత్ర బృందం.

సాయి తేజ్

ఈ పోస్టర్​లో మెగా కథానాయకుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఆరు పలకల దేహంతో కనిపిస్తున్నాడు. అతని ఒంటిపై ఉన్న ఓం ట్యాటు ప్రధాన ఆకర్షణ. తేజ్‌ పోరాట సన్నివేశంలో ఉన్న పోస్టర్‌ ఇది. ఇందుకు సహకరించిన తన ట్రైనర్‌ రాకేష్‌కు కృతజ్ఞతలు చెప్పాడు తేజ్‌. ఈ మెగా హీరో పక్కన రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. మారుతి దర్శకుడు.

ఇవీ చూడండి.. వరల్డ్ ఫేమస్ లవర్: ఇజబెల్లెతో విజయ్​

ABOUT THE AUTHOR

...view details