తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2020, 4:52 PM IST

Updated : Feb 18, 2020, 3:12 AM IST

ETV Bharat / sitara

'ఉప్పెన'లో లవర్​బాయ్​గా వైష్ణవ్‌ తేజ్‌ ఫస్ట్​లుక్​

మెగా కుటుంబం నుంచి వస్తోన్న మరో యువ నటుడు వైష్ణవ్​ తేజ్​. సుప్రీం హీరో సాయిధరమ్​ తేజ్​ సోదరుడైన ఇతడు.. ప్రస్తుతం ఉప్పెన సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్​లుక్​ ఇవాళ విడుదలైంది.

Mega Family Vaishnav Tej debut film uppena first look poster released
'ఉప్పెన'లా వైష్ణవ్‌ తేజ్‌ ఫస్ట్​లుక్​

సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించాడు వైష్ణవ్‌. అయితే ఈరోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్‌ లవర్‌ బాయ్‌గా కనిపించాడు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ, సుకుమార్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Last Updated : Feb 18, 2020, 3:12 AM IST

ABOUT THE AUTHOR

...view details