భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మెగాకుటుంబం సందేశంతో కూడిన ఓ ఫొటోను పంచుకుంది. ఇందులో భాగంగా మెగా ఫ్యామిలీలోని కొందరు సభ్యులు బోర్డులు పట్టుకుని కరోనా విషయంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇప్పుడిది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కరోనా జాగ్రత్తలపై ప్రజలకు మెగా ఫ్యామిలీ సందేశం - covid news
లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండి, కరోనాను తరిమికొట్టాలని చెప్పింది మెగా కుటుంబం. ఈ విషయాన్నే చెబుతూ ఓ ఫొటోను పోస్టు చేశారు.
మెగా కుటుంబం
"ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై భారత్‌ను గెలిపిస్తాం. #STAY HOME #STAY SAFE " అని ఈ ఫొటోలో ఉంది.
ప్రస్తుతం చిత్ర షూటింగ్‌లు, ఇతరత్రా కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి అలరిస్తున్నారు.