అగ్రకథానాయకుడు చిరంజీవి కుటుంబానికి చెందిన ఈతరం మహిళలందరూ మేకప్, నో మేకప్ లుక్స్‌తో తాజాగా మెప్పించారు. లాక్‌డౌన్ కారణంగా గత కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమైన వీరందరూ.. ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మెగా లేడీస్ 'నో మేకప్' లుక్స్ వైరల్ - మెగా లేడీస్ నో మేకప్ లుక్స్ వైరల్
మెగాకుటుంబానికి చెందిన మహిళలు.. మేకప్, నో మేకప్ లుక్స్‌తో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
![మెగా లేడీస్ 'నో మేకప్' లుక్స్ వైరల్ Mega daughter without makeup challenge video](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6909349-thumbnail-3x2-rk.jpg)
మెగా లేడీస్ 'నో మేకప్' లుక్స్ వైరల్
ఇందులో మెగాస్టార్ చిరు కుమార్తెలు సుస్మిత, శ్రీజలతోపాటు నాగబాబు కుమార్తె నిహారిక, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితోపాటు మరికొంత మంది మహిళలు నో మేకప్, మేకప్ లుక్స్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను 'లాక్‌డౌన్ లేడీస్' అని పేర్కొంటూ నిహారిక ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
ఇదీ చూడండి : తలగడ, పేపర్లు మాత్రమే వాడుతున్న పాయల్