మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. నాగబాబు కుమార్తె నిహారిక ఇందుకు సంబంధించిన హింట్ ఇవ్వడం సహా కాబోయే వ్యక్తితో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం కనబడకుండా అటువైపుకు తిప్పి ఉండటం వల్ల అతడు ఎవరై ఉంటారా? అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి ఇతడితోనే!
తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటోను హీరోయిన్ నిహారిక తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత వీరి వివాహం జరిగే అవకాశముంది.
హీరోయిన్ నిహారిక
ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నిహారిక.. దాని దిగువన 'peek-a-boo'(దాగుడుమూతలు) అని రాసుకొచ్చింది. దీనితో పాటే ఈ ఫొటోతో చేసిన ఓ మీమ్‌ను తన స్టోరీలో పంచుకుంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.
ఇవీ చదవండి: