మెగా వారసురాలు నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నలగడ్డ మూడు ముళ్లు వేసే తేదీ ఖరారైంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి జరగబోతున్నట్లు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రభాకర రావు దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్న అనంతరం వివాహ వేదిక, సమయాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు చెప్పారు.
మెగాడాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఖరారు - niharika wedding dated fix
మెగాడాటర్ నిహారిక కొణిదెల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 9న చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడుముళ్లు వేయనున్నారు. రాజస్థాన్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది.
నిహారిక
ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుక ఫొటోలు ఆకట్టుకున్నాయి. మెగాడాటర్ ఇంట్లో పసుపు కొట్టే శుభకార్యం కూడా నిర్వహించారు. ఇటీవల నిహారిక తన స్నేహితుల కోసం బ్యాచిలరేట్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. దీని కోసం వారితో కలిసి ప్రత్యేకంగా గోవా వెళ్లి వచ్చారు.
ఇది చూడండి :
Last Updated : Nov 4, 2020, 5:01 PM IST