'జబర్దస్త్' ఫేమ్ కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారాడు. శ్రీపద్మజ పిక్చర్స్ పతాకంపై కోవూరు అరుణాచలం నిర్మాతగా కొత్త సినిమా మొదలుపెట్టాడు. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
దర్శకుడిగా మారిన 'జబర్దస్త్' కమెడియన్ - అదిరింది కిరాక్ ఆర్పీ
హాస్యనటుడిగా బుల్లితెరపై మెప్పిస్తున్న కిరాక్ ఆర్పీ.. తొలి సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం.
దర్శకుడిగా కిరాక్ ఆర్పీ
జేడీ చక్రవర్తితో పాటు మెగాబ్రదర్ నాగబాబు ముఖ్యఅతిథులుగా హాజరై ఆర్పీకి అభినందనలు తెలిపారు. ఆసక్తికరమైన కథతో దర్శకుడిగా పరిచయమవుతున్నానని చెప్పిన ఆర్పీ.. త్వరలోనే హైదరాబాద్, నెల్లూరు పరిసరాల్లో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు.
Last Updated : Aug 23, 2020, 4:54 PM IST