బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ షాహిద్ కపూర్ మైనపు విగ్రహాన్ని గురువారం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. షాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మైనపు బొమ్మతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. కవలలు అనే కామెంట్ పెట్టాడు. అతడి భార్య మీరా రాజ్‌పుత్ మైనపు విగ్రహం, భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ... " నా వాడిని నేను ఇంటికి తీసుకెళ్తున్నా. కానీ మీ కోసం ఇంకొకరిని ఇక్కడే వదిలేస్తున్నా మేడమ్ " అని క్యాప్షన్ జత చేశారు.
బొమ్మ మీది ఒరిజినల్ నాది : మీరా రాజ్‌పుత్ - బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అరుదైన ఘనత పొందాడు. ప్రతిష్ఠాత్మక 'మేడమ్ టుస్సాడ్స్'లో తన మైనపు విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్నాడు. వేడుకలో షాహిద్, ఆయన భార్య మీరా రాజ్‌పుత్, పిల్లలు మిషా, జైన్ కపూర్ హాజరయ్యారు.
బొమ్మ మీది ఒరిజినల్ నాది : మీరా రాజ్‌పుత్
ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన సెలబ్రిటీలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొణే , కరణ్ జోహార్ మైనపు విగ్రహాలని ఇదే మ్యూజియంలో ఉంచారు.
అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్‌సింగ్'తో షాహిద్ కపూర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలు సృష్టిస్తోంది. జూన్ 21 ఈ చిత్రం విడుదల కానుంది.