తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వేధింపులపై పోలీసులకు మీరాచోప్రా ఫిర్యాదు - Meera Chopra latest news

సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది నెటిజన్లు వేధిస్తున్నారని హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు టాలీవుడ్​ నటి మీరాచోప్రా. అసభ్యకరంగా కామెంట్లు​ చేసిన స్క్రీన్​షాట్లను ట్విట్టర్​ వేదికగా ట్వీట్​ చేశారు. జాతీయ మహిళా కమిషన్​, హైదరాబాద్​ సిటీ పోలీస్​, ట్విట్టర్​ సహా పలు అకౌంట్లకు తన ట్వీట్​ ట్యాగ్​ చేయడమే కాకుండా.. గ్యాంగ్​ రేప్​, యాసిడ్​ దాడి, హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

Meera Chopra Complained to Hyderabad City Police about rape threats from Jr. NTR Fans
'గ్యాంగ్​రేప్​' వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన మీరాచోప్రా

By

Published : Jun 3, 2020, 12:51 PM IST

Updated : Jun 3, 2020, 2:58 PM IST

అగ్ర కథానాయకుడు తారక్‌ అభిమానులు తనని వేధిస్తున్నారని నటి మీరా చోప్రా సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మీరా.. తాజాగా 'ఆస్క్​ మీరా' పేరుతో ట్విట్టర్​లో అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ 'ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?' అని ప్రశ్నించాడు. 'నాకు ఆయన గురించి తెలియదు. ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు' అని మీరా సమాధానమిచ్చింది. మీరా ఇచ్చిన ఆన్సర్​కు అసహనానికి గురైన కొందరు నెటిజన్లు ఆమెను అసభ్యపదజాలంతో దూషిస్తూ ట్వీట్లు పెట్టారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు.

ట్విట్టర్​ వేదికగా ఫిర్యాదు చేసిన మీరాచోప్రా

నెటిజన్ల ట్వీట్లతో ఆవేదనకు గురైన మీరా ట్విటర్‌ వేదికగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కొందరు నెటిజన్లు తనని వేధిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ పలువురు చేసిన ట్వీట్లను స్క్రీన్​‌షాట్లను‌ తీసి పోలీసులకు షేర్‌ చేశారు.

"హైదరాబాద్‌ సిటీ పోలీస్‌, సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ‌.. ఈ ట్విటర్‌ ఖాతాదారులందరిపై ఫిర్యాదు చేస్తున్నాను. వీళ్లందరూ గ్యాంగ్‌రేప్‌, చంపేస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు. దురదృష్టకరం ఏమిటంటే వీళ్లందరూ ఎన్టీఆర్‌ అభిమానులు. ట్విటర్‌.. మీరు కూడా ఈ ట్వీట్లను ఒక్కసారి గమనించి, వెంటనే సదరు అకౌంట్లను తొలగించాలని కోరుకుంటున్నాను" అని మీరా ట్వీట్‌ చేశారు.

అనంతరం ఆమె ఎన్టీఆర్‌కి కూడా ట్వీట్‌ చేశారు. "ఎన్టీఆర్‌.. మీకంటే ఎక్కువగా మహేశ్‌ బాబుని అభిమానిస్తున్నానని చెప్పినందుకు మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు. ఇలాంటి అభిమానులు ఉంటే విజయం వరిస్తుందని మీరు భావిస్తున్నారా?" అని మీరా ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'తారక్​.. మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు'

Last Updated : Jun 3, 2020, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details