మెగా హీరో కల్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో శ్రీధార్ సిపాన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి దేవ్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చిరంజీవి తనయ, కల్యాణ్ దేవ్ భార్య శ్రీజ ఓ షాట్‌కు యాక్షన్ చెబుతూ కనిపించింది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
భర్త చిత్రానికి దర్శకత్వం వహించిన మెగా డాటర్ శ్రీజ - భర్త చిత్రానికి దర్శకత్వం వహించిన మెగా డాటర్ శ్రీజ
నేడు మెగా హీరో కల్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఇతడి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. 'సూపర్ మచ్చి' నుంచి పాటను విడుదల చేయగా, మరో సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
భర్త చిత్రానికి దర్శకత్వం వహించిన మెగా డాటర్ శ్రీజ
కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతోన్న మరో చిత్రం 'సూపర్ మచ్చి'. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. రచితా రామ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈరోజు కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 'మీనమ్మ' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. తమన్ సంగీతం అందించిన ఈ పాటను వేణు శ్రీరంగం, గీతామాధురి ఆలపించారు.