తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్: జీవితంలో ఓ స్కిప్ బటన్ ఉంటే..! - mahesh babu launched trailer

హీరో మహేశ్​బాబు చేతుల మీదుగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రతి సీన్​ నవ్విస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

మీకు మాత్రమే చెప్తా ట్రైలర్

By

Published : Oct 16, 2019, 9:45 PM IST

యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఎ కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ప్రొడక్షన్‌ పతాకంపై నటుడు విజయ్‌ దేవరకొండ నిర్మిస్తున్నాడు. ప్రముఖ కథానాయకుడు మహేశ్​బాబు.. ఈ సినిమా ట్రైలర్​ను బుధవారం విడుదల చేశారు.

చిత్రబృందంతో హీరో మహేశ్​బాబు

హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ గాత్రంతో ప్రారంభమయ్యే ప్రచార చిత్రం కడుపుబ్బా నవ్విస్తోంది. 'మన లైఫ్‌ మన చేతిలో ఉందో లేదో కానీ మనందరి చేతిలో కచ్చితంగా ఫోన్‌ ఉంటుంది. చెవులు చిట్లిపోయే వరకు, చెంపలు కాలిపోయే వరకు వాగుతూనే ఉంటారు', 'మన దేశ ప్రజలు రోజుకు సగటున 6 గంటలు వీడియోలు చూస్తారట.. అందులో ఓ వీడియో మీదే అయితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్' అంటూ వచ్చే డైలాగ్​లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి.

ఈ చిత్రంలో అనసూయ, అభినవ్ గోమటం, వాణి భోజన్, పావని గంగిరెడ్డి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. శివ కుమార్ సంగీతమందించాడు. షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించాడు. వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details