విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో కృతజ్ఞతా కార్యక్రమం ఏర్పాటు చేసింది చిత్రబృందం.
తరుణ్ భాస్కర్, అభినవ్‌తో పాటు కథానాయికలు అవంతిక, పావని, దర్శకుడు షమీర్, ఇతర సాంకేతిక నిపుణులు హాజరై తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచేందుకే తాను నిర్మాతగా మారినట్లు విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. అసలు సినిమాల్లోకి వస్తాననుకోలేదంటూ అభిమానులకు ఆసక్తికర విషయాలు చెప్పాడు.