ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. 'పెళ్లి చూపులు' వంటి క్లాస్ చిత్రం తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని లాలా అంటూ సాగే లిరికల్ గీతాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు విజయ్. సూపర్ మారియో వీడియో గేమ్‌ను పోలినట్టున్న ఈ పాట చూపరులను ఆకట్టుకుంటోంది.
ప్రముఖ వీడియో గేమ్‌ను పోలిన లిరికల్ పాట - meeku mathrame cheptha cinema
'మీకు మాత్రమే చెప్తా' సినిమాలోని తొలి లిరికల్ పాట.. సూపర్ మారియో వీడియో గేమ్‌లా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వీడియో గేమ్‌ను పోలిన లిరికల్ పాట
ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ కుమార్ సంగీతమందిస్తున్నాడు. షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అలరిస్తోంది.
ఇది చదవండి: మీకు మాత్రమే చెప్తా టీజర్: ప్రతీ ఫోన్లో ఓ రహ్యసముంటుంది
Last Updated : Oct 1, 2019, 5:32 AM IST