బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో తన ఇంటివద్ద ఉంది. కానీ ఈ మధ్య ముంబయి వివాదంలో కంగన విమర్శలు ఎదుర్కొంటోంది. శివసేన నేతలు, కంగన మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న ముంబయి వెళ్లనుంది. ఈ క్రమంలోనే సిమ్లాలోని ఆమె నివాసానికి వైద్య బృందం వచ్చి కరోనా టెస్టు చేసింది.
ఇంటివద్దే కంగనకు కరోనా టెస్టు
ముంబయి ప్రయాణానికి ముందు బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య బృందం ఆమె నివాసానికి వచ్చి టెస్టులు చేసింది.
కంగనతో సహా ఆమె సోదరి రంగోలి రక్తనమూనాలను తీసుకున్నామని.. రేపటిలోగా ఫలితాలు వస్తాయని వైద్యులు తెలిపారు. కాగా శివసేన నేత సంజయ్ రౌత్, కంగన మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో.. కంగనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది.
ఇటీవలే బాలీవుడ్ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే తాను ఎక్కువగా భయపడుతున్నట్లు కంగన చెప్పింది. దీనిపై స్పందించిన శివసేన నేత సంజయ్.. ఆమెను ముంబయికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. దీనిపై స్పందిస్తూ ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ.. కంగన ట్వీట్ చేసింది. దీంతో సెప్టెంబరు 9న ముంబయిలో అడుగుపెడతానని.. వీలైతే ఆపుకోమని కంగన సవాలు విసిరింది.