అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో యువ నటుడికి జంటగా నటిస్తోంది పూజా హెగ్దే. గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
అఖిల్‌ను కంగారు పెడుతోన్న విషయమేంటి? - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్
యువ నటుడు అక్కినేని అఖిల్ నటిస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీజర్ విడుదలైంది. విజయ దశమి సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీజర్ విడుదల
చాకచక్యంగా మాట్లాడుతూ నటుడు అఖిల్‌ను కంగారు పెడుతోంది పూజాహెగ్దే. పెళ్లైన తర్వాత తన భర్త తనకు నచ్చినట్లు ఉండాలనే భావంతో ఉన్న హీరోయిన్ను అఖిల్ ఎలా ప్రేమిస్తాడు? అనే విధంగా టీజర్‌ను ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు భాస్కర్.
ఇదీ చదవండి:దసరా శుభాకాంక్షలు తెలిపిన సినీ తారలు