మెగాస్టార్ 153వ చిత్రం టైటిల్ ఇదే.. - గాడ్‌ఫాదర్‌గా చిరంజీవి

17:13 August 21
మెగాస్టార్ 153వ చిత్రం టైటిల్ ఖరారు
అగ్ర కథానాయకుడు చిరంజీవి వరుస సినిమాలతో జోష్ మీదున్నారు. యువ కథానాయకులకు దీటుగా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' షూటింగ్ పూర్తి చేసేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో మరో సినిమాలోనూ నటిస్తున్నారు. మలయాళ బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్' రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి శనివారం చిరు ప్రీలుక్‌తో పాటు, టైటిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజా చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'మాస్ కే బాస్' అనే రేంజ్‌లో చిరు 153వ సినిమా టైటిల్, ప్రీలుక్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్ష్ పతాకంపై ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న చిరు 153వ చిత్రంలో పలువురు స్టార్స్ మెరవనున్నారు. ఇప్పటికే సత్యదేవ్ మంచి పాత్ర దక్కించుకున్నారు. త్వరలోనే మిగిలిన నటీనటుల వివరాలను కూడా చిత్ర బృందం వెల్లడించనుంది. మరోవైపు మెహర్ రమేష్, బాబీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను ఆయా చిత్ర బృందాలు ఆదివారం విడుదల చేయనున్నాయి.