తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరిన్ని థియేటర్లలో మత్తువదలరా చిత్రం - మత్తువదలరా సినిమా

'మత్తువదలరా' చిత్ర కృతజ్ఞతా సభ హైదరాబాద్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

Matthu Vadlara Movie Thanks Meet Held In Hyderabad
మరిన్ని థియేటర్లలో మత్తువదలరా చిత్రం

By

Published : Dec 29, 2019, 10:01 PM IST

Updated : Dec 29, 2019, 10:14 PM IST

మరిన్ని థియేటర్లలో మత్తువదలరా చిత్రం

క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మత్తువదలరా'. ఈ సినిమా మంచి టాక్​తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది చిత్రబృందం.

చిన్న సినిమాల విడుదల ఎంత కష్టమో తెలిసిన కథపై నమ్మకంతో మత్తు వదలరా చిత్రాన్ని నిర్మించినట్లు ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని థియేటర్లలో మత్తు వదలరాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సినిమా విజయోత్సవాలపై తనదైన చురక అంటించిన కీరవాణి... తన కుమారులకు అప్పగించిన బాధ్యతలను గుర్తుచేసుకున్నాడు. మత్తు వదలరా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకు పెరుగుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో శ్రీ సింహా, అగస్త్య, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. ప్రముఖ గాయకుడు కాలభైరవ సంగీత దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది.

ఇదీ చదవండి: మహాభారతంపై జక్కన్న క్లారిటీ.. పూర్తి చేస్తానని వెల్లడి

Last Updated : Dec 29, 2019, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details