పెద్ద చిత్రానికి ఒక రోజు అయ్యే ఖర్చుతో సినిమా తీసి సరికొత్త విజయాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు రితేష్ రానా. పరిశ్రమలో అడుగుపెట్టేందుకు లఘుచిత్రాలతో ప్రయాణాన్ని ప్రారంభించి మూడేళ్లు కష్టపడిన రితేష్.. 'మత్తు వదలరా' సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తొలి మూవీతోనే అందరి మన్ననలు పొందుతున్న రితేష్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
'ఓ కంప్యూటర్.. రెండు హార్డ్‌డిస్క్‌లతో సినిమా పూర్తి చేశాం' - Sri Simha
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా పరిచయమైన చిత్రం 'మత్తు వదలరా'. క్రిస్మస్ రోజు విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ దర్శకుడు రితేష్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
మత్తు వదలరా
నలుగురు స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం సినిమాను పూర్తి చేసిన రితేష్.. కీరవాణి తనయుడు శ్రీసింహ, భైరవల భవిష్యత్ కు బంగారుబాటలు వేశాడు. అదే విధంగా తన ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేసి శభాష్ అనిపించుకున్నాడు.
ఇదీ చదవండి: రివ్యూ 2019: హాట్ సీన్లు, ఘాటు ముద్దులకు ప్రేక్షకులు నో!