జేమ్స్ కేమరూన్ ఊహకు ప్రతిరూపం 'అవతార్'. సామ్ వర్తింగ్టన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆల్టైమ్ హిట్గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఇందులో కథానాయకుడిగా మొదట హాలీవుడ్ హీరో మ్యాట్డామన్ను అనుకున్నారు. తను నటించిన 'బోర్న్ అల్టిమేటమ్' చిత్ర దర్శకుడు పాల్ గ్రీన్గ్రాస్తో సమస్య వచ్చిన కారణంగా 'అవతార్'ను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు మ్యాట్. అయితే 'అవతార్'లో నటిస్తే లాభాల్లో పదిశాతం వాటా ఇస్తానని కేమరూన్ అన్నాడని చెప్పాడీ నటుడు.
"తనకు ఏ హీరో అవసరం లేదని, ఎవరినైనా పెట్టి సినిమా తీయగలననికేమరూన్ నాతో చెప్పాడు. నేను ఒప్పుకుంటే లాభాల్లో పది శాతం వాటా, అంటే 250 మిలియన్ డాలర్లు(రూ. 1770 కోట్లకు పైగా) ఇస్తానని అన్నాడు. అప్పటికే 'ద బోర్న్ అల్టిమేటమ్' ఒప్పుకోవడం, ఆ చిత్ర దర్శకుడు పాల్ గ్రీన్గ్రాస్ అభ్యంతరం చెప్పడం వల్ల 'అవతార్' వదులుకోవాల్సి వచ్చింది" -మ్యాట్ డామన్, హాలీవుడ్ హీరో
అయితే కేమరూన్ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నట్లు చెప్పాడు మ్యాట్.