తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్: నిజం చెప్పు.. నిద్రపోయి కలగనలేదు కదా! - కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా

శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్న 'మత్తు వదలరా' సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కథానాయకుడు రానా.. ఈ ప్రచార చిత్రాన్ని తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నాడు.

ట్రైలర్: నిజం చెప్పు.. నిద్రపోయి కలగనలేదు కదా!
'మత్తు వదలరా' సినిమా ట్రైలర్

By

Published : Dec 18, 2019, 4:20 PM IST

అతినిద్ర వల్ల ఓ డెలివరీ బాయ్.. తన జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలేంటో తెలియాలంటే 'మత్తు వదలరా' సినిమా చూడాల్సిందే. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు. పెద్ద కొడుకు కాల భైరవ సంగీతమందిస్తున్నాడు. నూతన నటీనటులు ఎక్కువగా ఈ చిత్రంలో నటించారు. రితేశ్ రానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను, రామ్‌చరణ్‌ టీజర్‌.. ఇప్పుడు రానా ట్రైలర్​ను విడుదల చేశాడు.

ఇందులో హీరోయిన్​గా అతుల్య చంద్ర నటించింది. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ABOUT THE AUTHOR

...view details