తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా.. విడుదల కాకముందే అదరగొడుతోంది. ఈ సినిమా టీజర్.. 4 కోట్ల వ్యూస్ మార్క్‌ను అందుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా గురువారం వెల్లడించింది చిత్ర నిర్మాణ సంస్థ. దీపావళి కానుకగా విడుదలైన ఈ టీజర్.. అత్యధిక లైకులు అందుకొని ఇటీవలే వార్తల్లో నిలిచింది.
సరికొత్త రికార్డు సృష్టించిన 'మాస్టర్' టీజర్ - మాస్టర్ సినిమా
తమిళ స్టార్ కథానాయకుడు విజయ్ 'మాస్టర్' టీజర్.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. యూట్యూబ్‌లో నాలుగు కోట్ల వీక్షణలను కొల్లగొట్టింది.
సరికొత్త రికార్డు సృష్టించిన 'మాస్టర్' టీజర్
'ఖైదీ' ఫేం లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించారు. మాళవికా మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భాగ్యరాజ్, అర్జున్ దాస్, సిమ్రన్, ఆండ్రియా, శ్రీనాథ్, సంజీవ్ గౌరీ కిషన్, వీజే రమ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది.
ఇదీ చూడండి:రికార్డులతో అదరగొడుతోన్న విజయ్ 'మాస్టర్'