నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నాయికలు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో దీన్ని తీర్చిదిద్ది, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. జిషు సేన్‌గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రూ. 6.5 కోట్ల సెట్‌లో.. 'శ్యామ్ సింగరాయ్' - శ్యామ్ సింగరాయ్కు భారీ సెట్
నాని కథానాయకుడిగా నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్ర నిర్మాణానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు తాజాగా చిత్ర బృందం ఓ భారీ సెట్ వేసినట్లు పేర్కొంది.
నాని, శ్యామ్ సింగరాయ్
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. కథ సత్యదేవ్ జంగా రాశారు. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది 'శ్యామ్ సింగరాయ్'.
ఇదీ చదవండి:'మోహన' గానానికి క్రేజ్ పెరిగిన వేళ