తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాస్ మహారాజా రవితేజ.. గోలీసోడా పడితే - MASS MAHARAJA RAVITEJA KRACK CINEMA FIRST LOOK

హీరో రవితేజ 'క్రాక్' సినిమా ఫస్ట్​లుక్.. కొత్త ఏడాది కానుకగా విడుదలైంది. పోలీస్​ లుక్​లో అలరిస్తున్నాడీ కథానాయకుడు. ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

మాస్ మహరాజా రవితేజ.. గోలీసోడా పడితే
క్రాక్​ సినిమాలో హీరో రవితేజ

By

Published : Jan 1, 2020, 11:15 AM IST

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం 'క్రాక్'. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. గోలీసోడా తన కంటిపై పెట్టుకొని, తీక్షణంగా చూస్తున్న రవితేజ లుక్​ ఆకట్టుకుంటోంది. అతడి వెనకవైపు ఖైదీలు నిలబడి భయం భయంగా చూస్తున్నారు.

రవితేజ క్రాక్​ సినిమా ఫస్ట్​లుక్

రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్​లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇంతకు ముందు వీరిద్దరూ 'డాన్ శీను', 'బలుపు' చిత్రాల కోసం కలిసి పనిచేశారు. ముచ్చటగా మూడోసారి హిట్​ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్​ పూర్తి చేసుకుందీ 'క్రాక్'.

ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. సముద్రఖని, బాబీ సింహా, వరలక్ష్మి శరత్​కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. బి.మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details