తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్రాక్​'తో కిర్రాక్ కాంబినేషన్ రిపీట్ - రవితేజ కొత్త సినిమా

'బలుపు' కాంబినేషన్ రిపీట్ అయింది. అందులో హీరోహీరోయిన్లుగా మెప్పించిన రవితేజ, శ్రుతి హాసన్.. 'క్రాక్' అనే సినిమాలో మరోసారి జంటగా నటిస్తున్నారు. హైదరాబాద్​లో గురువారం లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం.

'క్రాక్​'తో కిర్రాక్ కాంబినేషన్ రిపీట్

By

Published : Nov 14, 2019, 11:56 AM IST

Updated : Nov 14, 2019, 3:53 PM IST

మాస్ మాహారాజ్ రవితేజ కొత్త చిత్రం 'క్రాక్'. గురువారం.. హైదరాబాద్​లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రెండేళ్ల విరామం తర్వాత తెలుగులోకిమళ్లీ ఎంట్రీ ఇస్తోంది శ్రుతి హాసన్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

క్రాక్ సినిమా పోస్టర్

అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సురేందర్ రెడ్డి, దిల్ రాజు స్క్రిప్టును అందించారు. కె.రాఘవేంద్రరావు తొలి షాట్​కు గౌరవ దర్శకత్వం వహించారు.

తొలిషాట్​కు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం
స్క్రిప్ట్​ అందజేస్తున్న దిల్​రాజ్, సురేందర్​రెడ్డి

'క్రాక్'కుతమన్ సంగీతం అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్​లు రాస్తున్నాడు.బి.మధు నిర్మాత. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

రవితేజ, శ్రుతి హాసన్ కాంబినేషన్​లో ఇంతకు ముందు 'బలుపు' సినిమా వచ్చింది. ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికీ గోపీచంద్ మలినేనియే దర్శకత్వం వహించాడు.

రవితేజ-శ్రుతిహాసన్
రవితేజ 66వ చిత్రం ప్రారంభోత్సవం
Last Updated : Nov 14, 2019, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details