టాలీవుడ్ కథానాయకుడు రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. తొలిసారి ప్రతినాయుకుడి ఛాయలున్న రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.
మాస్ మహారాజ్ మరోసారి ద్విపాత్రాభినయం? - ఈటీవీ భారత్
ప్రతిసారి ఏదో ఒక సరికొత్త కథాంశంతో తన అభిమానులను పలకరిస్తుంటాడు మాస్ మహారాజ్ రవితేజ. తన కొత్త చిత్రంలో అతను ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తాడని సమాచారం. ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.
మాస్ మహారాజ్ మరోసారి ద్విపాత్రాభినయం?
గతంలో రవితేజతో 'వీర' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు రమేష్. మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుండటం వల్ల అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రవితేజ.. 'విక్రమార్కుడు', 'దరువు', 'కిక్ 2', 'డిస్కోరాజా' చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథతోనే తెరపైకి రానుండటం వల్ల సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి...'మైదాన్'లో ప్రతీకారం తీర్చుకోవటానికి సై
Last Updated : Feb 28, 2020, 1:48 PM IST