సినీప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'టెనెట్' ఆగస్టు 26న బుధవారం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే లండన్లోని ఓ థియేటర్లో అభిమానులతో కలిసి కేరింతలు కొడుతూ దర్శకుడు క్రిస్టోఫర్ నొలాన్, స్టార్ హీరో టామ్ క్రూజ్ ఈ సినిమాను వీక్షించారు.
ఈ చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడిన క్రూజ్.. మళ్లీ థియేటర్లో కూర్చొని సినిమాను చూడడంపై హర్షం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఇందులో మాస్క్ ధరించడం సహా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను ఎంజాయ్ చేశాడు క్రూజ్.