తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మసకలీ 2.0'పై రెహమాన్ అసంతృప్తి'

'దిల్లీ 6' సినిమాలోని 'మసకలీ' పాటకు అప్పట్లో ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభించింది. ఇప్పుడిదే పాటను రీమేక్​ చేసి విడుదల చేసింది టీ-సిరీస్​. తాజాగా దీనిపై ఒరిజినల్​ పాటను కంపోజ్​ చేసిన సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​ స్పందించాడు.

'Masakali' recreated: Rahman disappointed with new track, urges fans to 'enjoy the original'
'షార్ట్​కట్​లను ఎంచుకొని మ్యూజిక్​ డైరెక్టర్లు అవ్వకండి'

By

Published : Apr 9, 2020, 1:05 PM IST

Updated : Apr 9, 2020, 1:40 PM IST

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన 'మసకలీ' పాట రీమేక్​ను బుధవారం విడుదల చేసింది టీ-సిరీస్​. దీని ఒరిజినల్​ వర్షెన్​ను సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​.. 'దిల్లీ 6' చిత్రం కోసం స్వరపరిచాడు. తాజాగా ఈ పాటను సిద్ధార్థ్​ మల్హోత్రా, తారా సుతారియాలతో రీమేక్ చేాశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వివాదాస్పదమైంది.

దీనిపై ట్విట్టర్​లో స్పందించిన రెహమాన్​.. తాను ఇలాంటి సులభమైన దారుల్లో సంగీత దర్శకుడిగా మారలేదని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి అలాంటి పాటలను స్వరపరిచానని తెలిపాడు. మిగిలిన స్వరకర్తలంతా ఇదే నీతిని పాటిస్తారని ఆశించాడు. ప్రేక్షకులంతా ఒరిజినల్​ పాటనే వినాలని విజ్ఞప్తి చేశాడు.

'మసకలీ' రీమేక్​ను వింటే చెవులు దెబ్బతింటాయని 'దిల్లీ 6' సినిమా దర్శకుడు రాకేశ్​ ఓంప్రకాశ్​ మెహ్రా అన్నాడు. ప్రేక్షకులంతా ఈ పాటపై జాగ్రత్తగా ఉండాలని.. ఒరిజినల్​ సాంగ్​ను వినాలని కోరాడు. ఈ విషయంపై సింగర్​ మోహిత్​ చౌహాన్​ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అయితే సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ వివాదంపై దర్శకనిర్మాత హన్సల్​ మెహతా స్పందించాడు. రీమేక్​ చేసిన వారికి మద్దతుగా నిలిచాడు. 'మసకలీ 2.0' విడుదలైన 48 గంటల్లో ఎన్ని వీక్షణలు వచ్చాయో ఒకసారి చూడండని అన్నాడు. భవిష్యత్​లో ఇది మరింత హిట్​ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి.. కరోనా క్రైసిస్​ ఛారిటీకి విరాళాల వెల్లువ

Last Updated : Apr 9, 2020, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details