జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు హీరో రవితేజ. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'క్రాక్' చిత్రం సెట్స్‌పై ఉండగానే.. పలువురు దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేసి ఉంచారు. ఈ జాబితాలో నక్కిన త్రినాథరావు, రమేశ్ వర్మ, వక్కంతం వంశీ లాంటి వారితోపాటు దర్శకుడు మారుతి కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడీ దర్శకుల్లో రవితేజ ముందుగా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి 'క్రాక్' తర్వాత రవితేజ.. రమేశ్ వర్మ చిత్రంతోనే సెట్స్‌పైకి వెళ్తారని వార్తలొచ్చాయి. ఆయన ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి పెట్టారు. ఇప్పుడీ ప్రణాళికలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితుల్ని బట్టి నక్కిన త్రినాథరావు, వక్కంతం కథల్లో ఏదొకటి ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ముందుగా ఎవరి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనేది తెలియాల్సి ఉంది.