తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మారుతి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాహీరో..! - మరో మెగా హీరోతో మారుతి..?

'ప్రతిరోజూ పండగే' చిత్రంతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు మారుతి. మెగా మేనల్లుడు సాయితేజ్​కు హిట్​ను ఇచ్చాడు. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్.

maruthi
వరుణ్ తేజ్

By

Published : Jan 9, 2020, 5:54 PM IST

సాయిధరమ్‌ తేజ్‌తో 'ప్రతిరోజూ పండగే' తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు మారుతి. గతంలో అల్లు శిరీష్‌తో 'కొత్తజంట' తెరకెక్కించాడు. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడట. అతడెవరో కాదు.. వరుణ్‌తేజ్‌.

వరుణ్‌ కోసం ఓ కథను మారుతి సిద్ధం చేస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. ఇటీవలే 'గద్దలకొండ గణేష్‌' చిత్రంలో తనలోని మాస్‌ కోణాన్ని ఆవిష్కరించాడు వరుణ్‌. ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఇలాంటి సమయంలో మారుతి ప్రేమకథ వినిపించాడా, యాక్షన్‌ చూపిస్తాడా? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

వరుణ్ తేజ్

ఇవీ చూడండి.. సంక్రాంతి కోడి పందేలకు నాగశౌర్య దూరం..!

ABOUT THE AUTHOR

...view details