తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"నా 'ప్రాణం' ఇలా నిలిచిందంటే కారణం సుకుమారే" - Sukumar

ఓ 5డీ కెమెరా.. చిన్న ఛార్జింగ్‌ లైట్‌.. రూ.50 లక్షల పెట్టుబడి.. దర్శకుడిగా మారుతి సినీ ప్రయాణం వీటితోనే మొదలైంది. ఈ రోజు తాను ఇలా ఉండటానికి దర్శకుడు సుకుమారే కారణం అంటున్నాడు మారుతి.

Maruthi Says sukumar Saves his life through Arya movie
మారుతి

By

Published : Dec 24, 2019, 7:06 AM IST

సినీ దర్శకుడిగా 'ఈరోజుల్లో', 'బస్టాప్‌' లాంటి చిన్న బడ్జెట్‌ చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు కోట్లు కురిపించిన మారుతి.. 'భలే భలే మగాడివోయ్‌', 'మహానుభావుడు' చిత్రాలతో వందకోట్ల దర్శకుడిగా మారిపోయారు. తాజాగా 'ప్రతిరోజూ పండగే' చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా మారుతి తొలినాళ్లలో తన సినీ ప్రయాణంలో ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొన్నారో గుర్తుచేసుకున్నారు.

"నేనీరోజు ఈ స్థాయిలో నిల్చోని ఉన్నానంటే మొదటి కారణం 'ప్రాణం', రెండోది సుకుమార్‌ 'ఆర్య. 'ప్రాణం' వచ్చే నాటికి నేను చిత్రసీమలో పంపిణీదారుగా ఉన్నా. అప్పట్లో ఆ చిత్ర హక్కులు కొని నా ప్రాణం మీదకు తెచ్చుకున్నా. ఆ సినిమా ఫలితంతో నేను దారుణంగా నష్టపోయా. " -మారుతి, దర్శకుడు

"ప్రాణం తర్వాత చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయా. అదే సమయంలో సుకుమార్‌ అనే కొత్త దర్శకుడు 'ఆర్య' అనే చిత్రం తీస్తున్నారని బన్నీవాసు​ ద్వారా తెలిసింది. సినిమా బాగా వస్తోందని, తను పాలకొల్లు పంపిణీ హక్కులు కొందాం అనుకుంటున్నా అని చెప్పాడు. నన్ను పెట్టుబడి పెట్టమన్నాడు. నిజానికి అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు. కానీ, చివరిగా ఓ ప్రయత్నం చేసి మానేద్దామని నిర్ణయించుకొని నా భార్యకు అసలు విషయం చెప్పకుండా ఆమె దగ్గర నుంచి రూ.5లక్షలు తీసుకొని 'ఆర్య' కొన్నాను. ఆ చిత్రంతో మంచి లాభాలు రావడంతో మేం గట్టున పడటమే కాక, మమ్మల్ని వెనక్కు తిరిగి చూసుకోనివ్వకుండా చేసింది. నిజంగా ఈరోజు ఇక్కడిలా నుంచోని ఉన్నానంటే దానికి సుకూమరే కారణం" -మారుతి, దర్శకుడు

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ప్రతి రోజూ పండగే. ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: తమిళనాట ఎన్నికల్లో పోటీపడనున్న కంగనా, ప్రకాష్​రాజ్!​

ABOUT THE AUTHOR

...view details